హైదరాబాద్ మార్చి 7(జె ఎస్ డి ఎం న్యూస్) : గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మరియు టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి ల ఆధ్వర్యంలో శుక్రవారం తార్నాక లోని వారి నివాసంలో సికింద్రాబాద్ నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉపవాస ప్రార్థనల అనంతరం ఈ విందు జరిగింది.ఈ సందర్భంగా, ముస్లిం సోదరులతో కలిసి వారు మతసామరస్యం, ఆధ్యాత్మికత మరియు శాంతి సందేశాలను పంచుకున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వివిధ మస్జిద్లకు చెందిన ప్రముఖ మౌల్వీలు, మత పెద్దలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.వారిని సన్మానించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మస్జిద్ల అభివృద్ధి కోసం అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి హామీ ఇచ్చారు. మతసామరస్యం, సమాజంలోని అన్ని వర్గాల ప్రగతిని లక్ష్యంగా చేసుకుని ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా ఆహార పదార్థాలు, ఉపవాసాలకు అనుగుణమైన విందు సరఫరా చేశారు. మహిళలు, పిల్లలు సహా అన్ని వయస్సుల వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

