పాన్ బజార్ వేణుగోపాలస్వామి నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణస్వీకారం………

హైదరాబాద్ మార్చి 7(జేఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ పాన్ బజార్ లోని శ్రీ వేణుగోపాల్ స్వామి దేవాలయం నూతన పాలకమండలి సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం దేవాలయ అధికారి శ్రీదేవి నూతన పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో లక్ష్మీ ,ఎల్లేష్, అశోక్ బాబు, సదనంద్ నూతన పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో చైర్మన్ గా ఎల్లెష్ ను ఎన్నుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అనంతరం ఎల్లేష్ మాట్లాడుతూ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటామని, దేవాలయ అభివృద్ధి ముఖ్యమని ,ఆయన తెలియజేశారు. తనకు బాధ్యతలు అప్పగించిన సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టి పి సి సి ప్రధాన కార్యదర్శి కోట నీలిమకు పాలకమండలి సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *