రాయచోటి లో వీరభద్ర స్వామి శోభాయాత్ర పై జరిగిన ముస్లిం ల రాళ్ల దాడిని ఖండించిన విశ్వహిందూ పరిషత్ – ముఖ్యమంత్రి కి చేరే విధంగా సోమవారం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తాము -యావత్ హిందూ సమాజం ఈ ఘటనపై అలుపెరగని పోరాటం చేయాలని పిలుపు – విశ్వహిందూ పరిషత్ ఒంగోలు జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లిఖార్జునరావు.

కడప జిల్లా రాయచోటిలో మార్చి 4వ తేదీన జరిగిన శ్రీ వీరభద్ర స్వామి వారి శోభాయాత్ర పై రాళ్లు రువ్విన ముస్లిం సమాజం చర్యలను రాళ్ల దాడిని విశ్వహిందూ పరిషత్ ఒంగోలు జిల్లా తీవ్రంగా ఖండిస్తుందని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జున రావు తెలిపారు. స్థానిక విశ్వహిందూ పరిషత్ కార్యాలయం లో జరిగిన అత్యవసర సమావేశంలో తమ అధ్యక్షోపన్యాసములో మల్లికార్జున రావు మాట్లాడుతూ యావత్ హిందూ సమాజము ఇలాంటి చర్యలను చూస్తూ ఉండదని తగిన చర్యల కొరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళేదానికి 10వ తేది సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించడం జరుగుతుందని తెలిపారు.
సమావేశంలో జిల్లా కార్యదర్శి ఈమని బలరాం మాట్లాడుతూ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో సుందరంగా అలంకరించిన వీరభద్ర స్వామి వారి శోభాయాత్ర మేళతాళములతో భక్తుల స్వామివారి నామ కీర్తనలతో సాగుచుండగా మా మసీదు ప్రాంతంలో భజంత్రీలు ఆపాలని ముస్లిం యువత అడ్డుకొన్నారని, పోలీసులు సర్దిచెప్పిన తరువాత చల్లబడినట్లు కనపడినా… తదుపరి తిరుగు ప్రయాణంలో వీరబధ్ర స్వామి శోభాయాత్ర పై ముందస్తు ప్రణాళికతో వందలాదిగా వచ్చిన ముస్లింలు చెప్పులు, రాళ్లతో దాడి చేసారని, పోలీసులకు కూడా దెబ్బలు తగిలాయని, అయినప్పటికీ శోభాయాత్ర నిర్వాహకులపై, హిందూ భక్తులపై, స్వామి వారికి హారతులు ఇవ్వడానికి నిలబడిన మహిళలపై కూడా పోలీసులు లాఠీచార్జ్ చేశారని అనంతరం పోలీసులు దాడి చేసినవారిని సంతృప్తి పరచడానికి బాధిత హిందూ భక్తులపై కేసులు నమోదు చేసి కొందరిని అరెస్ట్ చేయడం జరిగినదని, బాధితులను దోషులుగా చేయడం దారుణమని, తక్షణమే అరెస్ట్ చేసినవారిని విడుదల చేయాలని కోరారు.
వి.హెచ్.పి విభాగ్ విశేష సంపర్క్ ప్రముఖ్ ఇనమనమెళ్ళూరి సీతారామయ్య మాట్లాడుతూ ముస్లిమ్స్ సమాజం చేసిన దాడి ఒక ఎత్తు అయితే బాధితులైన హిందువులపై పోలీసులు కేసులు నమోదు చేయడం మరో ఎత్తుగా అభివర్ణించి ఇదంతా కూడా ముందస్తు ప్రణాళికతో హిందువుల పండుగలను దేవీ దేవతామూర్తుల శోభాయాత్రలను అడ్డుకోవడం హిందూ సమాజం చూస్తూ ఉండదని ముఖ్యమంత్రి దాకా ఈ సంఘటనను తీసుకువెళ్లి హిందువులకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని అని హిందూ సంఘాలతో చలో రాయిచోటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వెనుకాడబోమని తెలిపారు జిల్లా ఉపాధ్యక్షులు జిల్లెలమూడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పదో తేదీ సోమవారం జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వినతిపత్రం సమర్పించడం జరుగుతుందని కావున యావత్ హిందూ సమాజం కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. సమావేశంలో త్రిపుర భైరవానంద స్వామి మాట్లాడుతూ హిందూ ముస్లిం భాయి భాయ్ అంటూ హిందూ సమాజమే ముందుకు సాగుతుందని ఈ బంధాన్ని తెంపడానికి కొందరు చేస్తున్న కుటిలయత్నాలు ఇలా దాడులకు ప్రేరేపిస్తున్నాయని దీనిని గమనించి ముస్లిం పెద్దలు తమ యువతను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు సమావేశంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యవర్గ సభ్యులు సాదు శ్రీనివాస గుప్తా, హరిబాబు, వేమూరి చక్రధర పెరుమాళ్లు, సుంకురఘు, బోయపాటి రవి, ప్రచార ప్రముఖ్ రాధా రమణ గుప్తా జంధ్యం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *