దామచర్ల సక్కుబాయమ్మ మహిళ ప్రభుత్వ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా శుక్రవారం సంఘమిత్ర హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన సిపిఆర్ అవగాహన సదస్సులో భారతీయ జనతా పార్టీ మహిళామోర్చా సభ్యులు పాల్గొన్నారు.
ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తులను వైద్యశాలకు తరలించే ముందుగా సిపిఆర్ చేయడంతో వారిని అపాయకర స్థితి నుండి రక్షించగలుగుతామని, ప్రతి ఒక్కరూ సిపిఆర్ చేయడంలో ప్రావీణ్యత సాధించి సమాజంలో ఎదురుపడే విపత్కర పరిస్థితులనుండి సాటివారిని రక్షాంచగలుగుతామని డా. దీప, డా. నందిత లు వివరించారు.
కార్యక్రమంలో బిజేపి మహిళా మోర్చాా జిల్లా ప్రధాన కార్యదర్శి బి. విజయరావు నమూనా పై ప్రయోగాత్మకంగా సిపిఆర్ నిర్వహించారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయరావు. జిల్లాకార్యదర్శి, మహిళా మోర్చా జిల్లా ఇన్చార్జి తీగల సత్యవతి, కార్యవర్గ సభ్యురాలు ధనిశెట్టి పావని, ఒంగోలు మండల అధ్యక్షురాలు దేవరపల్లి శ్రీలక్ష్మి మరియు కళాశాల అధ్యాపకులు, విద్యార్ధినులు పాల్గొన్నారు.

