రాంగోపాల్ పేట మార్చి 8(జే ఎస్ డీ ఎం న్యూస్) : మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చూపుతున్నారని, వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ సమితి నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కోట నీలిమ అన్నారు. శనివారం సమత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని రాంగోపాల్ పేట్ డివిజన్ చుట్టాల బస్తి నల్లగుట్టలో సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అద్యక్షులు త్రికాల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ నాదు మహిళలు కేవలం వంటింటికే పరిమితం అయ్యే వారిని నేడు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీపడుతూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారని మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో రాంగోపాల్ పేట డివిజన్ కాంగ్రెస్ నాయకులు త్రికాల శ్రీను,హేమంత్ వెంకట్, శ్రీలత, పద్మ, జ్యోతి, పావని, రఘు యాదవ్, రహీం, సాదిక్, రాజశేఖర్, సదానంద్, అఖిల్ ,విను తదితరులు పాల్గొన్నారు.
