బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవ వేడుకలు………

బేగంపేట మార్చి 8(జె ఎస్ డి ఎం న్యూస్) :
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బేగంపేట అడిషనల్ డిసిపి ట్రాఫిక్ నార్త్ వేణుగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మహిళా కానిస్టేబుల్స్ ను శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, ట్రాఫిక్ విభాగంలో మహిళా పోలీసులు అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ పాపయ్య, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *