మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో సంక్షేమ పథకాలు, పార్టీ పదవుల్లో 50 శాతం మహిళలకే కట్టబెట్టారని జెడ్సీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శని వారం చీమకుర్తిలోని బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో కాలేజీ మహిళా లెక్చరర్లు, సిబ్బంది ఆధ్వ ర్యంలో బూచేపల్లి వెంకాయమ్మను ఘనంగా సత్క రించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లా డుతూ.. మహిళల రక్షణకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
దిశ యాప్ ను తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
జిల్లాలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.





