అమీర్ పేట మార్చి 9(జే ఎస్ డి ఎం న్యూస్) : కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్ పేట లోని బుద్దా నగర్ కాలనీ కి నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన బాజీబాబా, కాలనీ వాసులతో ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలలో ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బాజీబాబా కు శుభాకాంక్షలు తెలిపారు. కాలనీలో ని సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పలు సమస్యలను ఎమ్మెల్యే కు విన్నవించగా త్వరలోనే బుద్దా నగర్ లో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ రెడ్డి, కాలనీ వాసులు వినోద్, శ్రీను, భిక్షపతి, జహంగీర్, సుమన్, రాము, గోపి తదితరులు పాల్గొన్నారు.
