హైదరాబాద్ మార్చి 7(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
అనాధలకు,పేద మధ్యతరగతి వర్గాలకు దళిత చైతన్య సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముప్పిడి నవీన్ కుమార్ మాదిగ అన్నారు.సేవా కార్యక్రమాలలో భాగంగా ఆదివారం బన్సి లాల్ పేట్ లోని దేవనార్ అందుల కళాశాలలో 200 వందల మంది అందులకు చికెన్ బిర్యానీ వడ్డించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ముప్పిడి నవీన్ కుమార్ మాదిగ మాట్లాడుతూ అందులకు ఒక పూట అన్నం పెట్టడం చాలా ఆనందంగా ఉందని.తమ సంఘం అణగారిన వర్గాలకు,పేద, మధ్యతరగతి ప్రజలకు ఎల్లపుడూ అండగా ఉంటుందన్నారు.అలాగే పేద ప్రజలు సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను ప్రభుత్వం దృషికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో అభిషేక్, సతీష్ రాజ్, సాయి, వెంకట్, మనోజ్, విశాల్,సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


