వంగవీటి రంగా పేద ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఉంటారు కాపుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి -మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి

బడుగు, బలహీన వర్గాల గుండెల్లో వంగవీటి మోహన రంగా ఎప్పుడూ ఉంటారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం నాడు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం జయవరం గ్రామంలో వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి డోలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…..ఈ గ్రామంలో కాపులు తక్కువ జనాభా ఉన్నప్పటికి వంగవీటి రంగాగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న దృఢ సంకల్పం చాలా మంచి సంకల్పం. రంగా మరణాంతరం కీర్తిప్రతిష్టలు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. ఆయన పేదల పట్ల అత్యంత అభిమానం కలిగి ఉండేవారు.పేదలు, కార్మికులందరిని చేరదీసి, వారికి అండగా ఉండేవారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఇప్పటికి కూడా ప్రజలు గుర్తించుకుంటారు. టీడీపీ హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపు యువతకు స్వయం ఉపాధికి రుణాలిచ్చాం. కానీ గత 5 ఏళ్లు జగన్ కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశారు.
రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఆ లోటును పూడ్చుకుంటూ
సంక్షేమాన్ని అందిస్తున్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఏ పార్టీకి ఏ జిల్లాలో ఎవరికి నామినేటెడ్ పదవి ఇవ్వాలి అనేది ఆ పార్టీల నాయకులు నిర్ణయిస్తారని, కార్యకర్తలు సహనం పాటించాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *