ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు మరియు పోలీస్ అధికారులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా పలు ప్రాంతాల నుండి వచ్చిన పిర్యాదుదారులతో అధికారులు ముఖాముఖీగా మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి వివరంగా అడిగి తెలుసుకుని ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరం పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
అందిన ఆయా ఫిర్యాదుల గురించి సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా భూ వివాదాలు, జాబ్ ఫ్రాడ్, కుంటుంబ సమస్యలు, చీటింగ్ మరియు ఇతర సమస్యల గురించి ప్రజా పిర్యాదులు వచ్చాయి.
*ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని….*
తనకు మరియు మరికొంత మంది రైతులకు సబ్సిడీ పనిముట్లు ఇప్పిస్తామని దర్శికి చెందిన ఒక వ్యక్తి రూ.16,82,000/- డబ్బులు తీసుకోని రెండు సంవత్సరాలు గడుస్తున్న వస్తువులు కానీ మరియు డబ్బులు ఇవ్వటం లేదని దర్శికి చెందిన రైతులు ఫిర్యాదు.
తన కుమారుడుకి కరెంటు ఆఫీస్ లో ఉద్యోగం ఇప్పించమని తన వద్ద నుండి ఆరు లక్షల రూపాయలు డబ్బులు ఒంగోలు చెందిన ముగ్గురు వ్యక్తులు తీసుకోని ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు అడుగుతుంటే బెదిరిస్తున్నారని ఒంగోలు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు.
ఈ కార్యక్రమంలో సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య, సి. సి. ఎస్ సీఐ జగదీష్, ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు రజియా సుల్తాన్, ప్రభాకర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.



