సాక్షి సీనియర్ పాత్రికేయుడు, సాక్షి రిపోర్టర్ ఎన్. గురుశాంతను అసోసియేషన్ (కేయూడబ్ల్యూజే) విశేష అవార్డుతో సత్కరించింది. 2024-2025 సంవత్సరం గానూ కర్ణాటక వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జర్నలిస్టులకు ప్రకటించిన ప్రత్యేక అవార్డుల ప్రదాన కార్యక్రమం కొప్పళ నగరంలో జరుగగా, బళ్లారికి చెందిన జర్నలిస్ట్ ఎన్. గురుశాంత కు విశేష ప్రశస్తితో సత్కరించారు. జర్నలిస్టుగా సుధీర్ఘ సేవలు అందించిన గురుశాంతను గుర్తించి ఈ అవార్డును రాష్ట్ర కన్నడ- సంస్కృతిక శాఖ మంత్రి, కొప్పళ జిల్లా ఇన్చార్జి మంత్రి శివరాజ్ తంగడిగి, ముఖ్యమంత్రి మీడియా సలహాదా రు కె.వి.ప్రభాకర్, కేయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు శివానంద్ తగడూరు. ప్రధాన కార్యదర్శి లోకేష్, కొప్పళ ఎమ్మెల్యే రాఘవేంద్రహి ట్నాల్ తోపాటు పలువురు ప్రముఖు లు జర్నలిస్టు గురుశాంతను శాలువా కప్పి ప్రశస్తితో సన్మానం చేశారు. కర్ణాటక వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషిచేస్తుందని, సీనియర్ జర్నలిస్టులను, వారిసేవలను పరిగణ లోకి తీసుకుని ప్రతి సంవత్సరం అవార్డులను అందజేస్తున్నట్లు అధ్యక్షుడు శివానంద తగడూరు తెలిపారు. కన్నడ భాష పాత్రికేయులతోపాటు కర్ణాటకలో సుధీర్ఘకాలం సేవలందిస్తున్న తెలుగు పత్రికల జర్నలిస్టుల సేవల్ని గుర్తించి, అవార్డులతో సత్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జర్నలిస్టులతోపాటు సంఘం కమిటీ కార్యవర్గ సభ్యులు, జిల్లా సంఘం పదాధికారులు పాల్గొన్నారు.

