విద్యుత్ ను సక్రమంగా ఉపయోగించుకోండి – విజిలెన్స్ ఈఈ హైమా వతి -తాళ్లూరు మండలంలో అకస్మిక దాడి- 35 బ్యాచ్ లతో గ్రామంలో తనిఖీ- 2900 సర్వీసులు తనిఖీ

విద్యుత్ ను అక్రమంగా కాకుంగా సరియైన విధానంలో వినియోగించుకోవాలని విద్యుత విజిలెన్స్ ఈఈ హైమావతి అన్నారు. తాళ్లూరు మండలంలో మంగళవారం విద్యుత్ అధికారులు సిబ్బందితో కలిసి 35 బృందాలుగా ఏర్పడి అకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్రమ విద్యుత్ కనెక్షన్ల వలన ప్రమాదాలు సైతం జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. విద్యుత్ మీటర్ తీసుకున్న సమయంలో ఉన్న లోడ్ కంటే అధనంగా ఉంటే అదనపు లోడ్ ను చలనా తీసి విద్యుత్ సిబ్బందికి తెలిపాలని కోరారు. మండలంలో 2900 విద్యుత్ సర్వీసులు పరిశీలించి అక్రమంగా వినియోగిస్తున్న 29 మందికి రూ.2లక్షల వరకు అపరాధ రుసుం విధించినట్లు విద్యుత్ దర్శి ఎడీఈ క్రిష్ణా రెడ్డి తెలిపారు. తనిఖీలలో విజిలెన్స్ ఎడీఈలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, చెన్నకేశవులు, అపరేషన్ ఎడీలు హరిబాబు, మోహన రావు, క్రిష్ణా రెడ్డి, తాళ్లూరు ఇన్చార్జి ఎఈ శ్రీనివాసరావుతో పాలు డివిజన్ ఎఈలు, ఎల్ఎం లు, సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *