ఇచ్చిన లక్ష్యాలను చేరుకోక పోతే కఠిన చర్యలు – ఎపీడి లలిత కుమారి

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఇచ్చిన లక్ష్యాలను చేరుకోవటంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఎపీడీ లలిత కుమారి అన్నారు. తాళ్లూరు ఎం ఎన్ ఆర్ ఈజీ ఎస్ కార్యాలయంలో మంగళవారం ఆమె ఉపాధి హామీ పధకంలో చేపట్టిన పలు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. మండలంలో రెండు వేలకు మంది పైగా ఉపాధి పనులలో పాల్గొన వలసి ఉండగా కేవలం 600 మంది మాత్రమే పాల్గొనటంపై ఫీల్డ్ అసిస్టెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. శ్రమ శక్తి సంఘాలు 150 ఏర్పాటు కావలసి ఉండగా 79, ఇంకుడు గుంతలు 145 తీయవలసి ఉండగా 45 తీయటంపై వివరణ అడిగారు. రైతులకు ఫామ్ పాండ్స్ గురించి తెలిపి లక్ష్యం మేరకు తీసేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఎపీఓ మురళి, ఈసీ కోటేశ్వర రావు, టీఏ లు కోటేశ్వర రావు రమేష్ లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *