చిరుధాన్యాల సాగుతో బహుళ ప్రయోజనం ఉందని తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. మండలంలోని శివరామపురం, మాధవరం గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. వరిగ తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో నికర ఆదాయం పొందవచ్చని అన్నారు. లోకల్ వెరైటీలు మన నెలలకు అనువైనవని తెలిపారు. కార్యక్రమంలో విఏఏ ఎం రాజశేఖర్, సుధీర్ రైతులు పాల్గొన్నారు.
