నాగార్జున సాగర్ ఆయుకట్టులో పంటలకు మార్చి చివరి వారం వరకు మాత్రమే
సాగు నీరు వస్తుందని ఇరిగేషన్ ఎన్ ఈ వరలక్ష్మి తెలిపారు. క్రిష్ణా నది నిర్వహణ బోర్డు సమావేశంలో నాగార్జున సాగర్ కుడి కాలువకు అంగీకరించబడిన నీటి కేటాయింపు మార్చి చివరి వరకు మాత్రమే సరిపోతాయని చెప్పారు. నీటిని ఏ మాత్రం వృథా చేయకుండా పంటలకు, తాగు నీటి చెరువులను నింపు కోవటానికి ఉపయోగించాలని కోరారు. మే నెలలో తాగు నీటి చెరువులను నింపుటకు నీరు విడుదల చేయు వరకు ఈ నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవలని ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.
మార్చి చివరి వారం వరకు సాగర్ సాగు నీరు
11
Mar