మార్చి 12 వ తేది న ఒంగోలు లో జరుగు యువత పోరు ను జయప్రదం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు .మంగళవారం దర్శి వైసీపీ కార్యాలయంలో మంగళవారం కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తూ ….విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు ప్రభుత్వం ఇవ్వకపోవడం మూలంగా అనేకమంది కాలేజీ ల యాజమాన్యాలు విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారని అన్నారు. ప్రియతమ నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా వున్నప్పుడు విద్యా దీవెన,వసతి దీవెన క్రింద ప్రతి సంవత్సరం స్కాలర్ షిప్ లు అందించారని అన్నారు. కూటమి ప్రభుతం అధికారం లోకి వచ్చాక ఇంత వరకు ఏటువంటి ఫీజులు చెల్లించలేదని అన్నారు. నిరుద్యోగ యువత కు ప్రతి నెల రూ. 3 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 9 నెలలు అయిన ఇంత వరకు ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ భృతి చెల్లించలేదని అన్నారు. ప్రభుత్వం వచ్చాక ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు అని అన్నారు.విద్యార్థులు యువకులతో కలిసి ఈ ప్రభుత్వం పై పోరును కొనసాగిస్తూ రేపు జరగబోవు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయ్యమ్మ దర్శి మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకట రెడ్డి పట్టణ అధ్యక్షులు ముత్తినీడి సాంబ, దొనకొండ ,కురిచేడు, ముండ్లమూరు , తాళ్లూరు అధ్యక్షులు కాకర్ల కృష్ణా రెడ్డి, సుబ్బయ్య యాదవ్, చింతా శ్రీనివాస రెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి , ముండ్లమూరు ఎంపీపీ ఎస్ ఎస్ బ్రహ్మా రెడ్డి ,మాజీ ఎంపీపీ లు పోశం మధుసూదన్ రెడ్డి ,ఇత్తడి దేవదానం, ముండ్లమూరు జడ్పీటీసీ రత్నరాజు,మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి జయంతి,జిల్లా యూత్ అధ్యక్షులు గొంగటి శ్రీకాంత్ రెడ్డి,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు




