నీట్ (యుజీ) – 2025 పరీక్ష మే నెల 4వ తారీఖు నిర్వహించబోతున్నారు అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉత్తర్వులు జారి చేసిన విషయం తెలిసిందే.
అయితే సదరు పరీక్షలు నిర్వహించబొవు పరీక్షా కేంద్రాల్లో సరైన వసతులు, రాకపోకల సౌలభ్యం మరియు భద్రతా ప్రమాణాలు ఆడిట్ చేయమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆర్డర్ వేసింది. ఈ విషయం లో, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాల మేరకు భంగి చిన్న ఓబులేసు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్టియే గుర్తించిన ఆరు సెంటర్లు రైస్ కృష్ణ, రైస్ గాంధీ, రైస్ పాలిటెక్నిక్ కాలేజీలు, QIS కాలేజీ, కేంద్రీయ విద్యాలయ మరియు నెక్సట్ జెన్ స్కూలు లను తనిఖీ చేసి ఫిజికల్ ఆడిట్ నిర్వహించారు. సదరు సెంటర్ లలో గమనించిన విషయాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కి సమర్పిస్తాం అని జిల్లా రెవెన్యూ అధికారి తెలియజేసారు.
డి.ఆర్. ఓ చిన ఓబులేసు వెంట సింగరాయకొండ సి.ఐ హాజరతయ్య, ఒంగోలు తాలూకా సి.ఐ అజయ్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ మనీష్, ఒంగోలు ఏం.ఈ. ఓ కిశోర్ బాబు పాల్గొన్నారు.




