రేణుకా ఎల్లమ్మ దేవాలయం లో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్……..

బేగంపేట మార్చి 12,(జె.ఎస్. డి.ఎం న్యూస్ ) :
పద్మారావు నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం లో బుధవారం నిర్వహించిన ప్రత్యేక పూజలలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. మంగళవారం ఆలయంలో చోరీ జరిగిన నేపథ్యంలో బుధవారం వేద పండితుల సూచనల మేరకు శాస్త్రోక్తంగా ఆలయ సంప్రోక్షణ, అమ్మవారికి అభిషేకం, పంచ హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారి ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ పూజలలో ఏ సి పి జైపాల్ రెడ్డి, చిలకలగూడ సి ఐ అనుదీప్, డి ఐ రమేష్ గౌడ్, పద్మారావు నగర్ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, ఆలయ నిర్వహకులు సాయిరాం చారి, హరి చారి, నాయకులు ఏసూరి మహేష్, లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, రమణ, మహేందర్ గౌడ్, కుమార్ యాదవ్, ముక్కా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *