తాళ్లూరు మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ శ్రేణులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ మండల, జిల్లా, రాష్ట్ర బాధ్యులు, ప్రజా ప్రతినిథులు, మాజీ ప్రజా ప్రతినిథులు, నాయకులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు.



