ప్రకాష్ నగర్ లో ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు…..కార్పొరేటర్ కు సమాచారం ఇచ్చిన బి ఆర్ ఎస్ నేత జాండ్ల కృష్ణ…..విద్యుత్ ,ఫైర్ శాఖలను అప్రమత్తం చేసిన కార్పొరేటర్ .తప్పిన పెనుముప్పు…..

బేగంపేట ప్రకాశం నగర్
సంపత్ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న ఓ ట్రాన్స్ ఫార్మర్ నుంచి బుధవారం అర్ధరాత్రి సుమారు గం 11.50.నుంచి గం 12ల
నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అదే సమయంలో అటుగా వస్తున్న బిఆర్ఎస్ నాయకుడు జాండ్ల కృష్ణ ఇది గమనించి వెంటనే ఈ విషయాన్ని బేగంపేట కార్పొరేటర్ టి మహేశ్వరి శ్రీహరి దృష్టికి తీసుకువెళ్లాడు. అప్రమత్తమైన కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి వెంటనే సమాచారాన్ని విద్యుత్ శాఖ అధికారులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఆయా శాఖల అధికారులు ట్రాన్స్ ఫార్మర్ నుంచి వస్తున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. ట్రాన్స్ ఫార్మర్ పక్కనే అపార్ట్మెంట్లు ఉండటం ట్రాన్స్ ఫార్మర్ నుంచి మంటలు అపార్ట్మెంట్ లకు వ్యాపించి ఉంటే పెద్ద ప్రమాదం సంభవించేది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మంటలు రావడం గమనించిన జాండ్ల కృష్ణ అప్రమత్తమై సమాచారాన్ని కార్పొరేటర్ అందించడం ఆమె అధికారులను అప్రమత్తం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సకాలంలో అధికారులకు సమాచారం ఇచ్చిన కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరికి ,సకాలం లో ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేసిన అగ్నిమాపక శాఖ సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది ,పోలీస్ సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రమాదంలో ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *