ఆక్రమణ భూమిని పరిశీలించిన తహసీల్దార్ – ప్రభుత్వ భూమిగా నిర్ధారణ – హద్దురాళ్లువేస్తామని తెలిపిన తహసీల్దార్

తాళ్లూరు ఎస్సీకాలనీ సమీపాన గల ప్రభుత్వని ఆక్రమించి సాగు చేస్తున్నారని, ఆస్థలంను స్వాధీనం చేసుకుని పేద ఎస్సీ లకు పట్టాలు ఇవ్వాలని ఎస్సీ కాలనీ పెద్ద అనపర్తిసుబ్బారావు జిల్లా అధికారులకు అందజేసిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కె.సంజీవరావు బుధవారం విచారణ చేపట్టారు. తాళ్లూరు ఎస్సీ కాలనీ సమీపానసర్వే నెంబర్ 476 నందు 4 ఎకరాల 80 సెం ట్లప్రభుత్వ భూమివున్నదని, అందులో 2ఎకరాల భూమిని కస్తూర్బా పాఠశాలకు కేటాయించగా,మిగిలిన భూమి ప్రభుత్వ భూమిగా వున్నదని, ఆభూమిని పేదలకు నివేశన స్థలాలు అందించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టగా కాలనీకి చెందిన నల్లూరి నాగయ్య ఆక్రమించాడని ఫిర్యాదుదారుడు అనపర్తి సుబ్బారావు అధికారులకు విన్నవించాడు. 2015 అధికారులకు ఫిర్యాధు చేయగాతహసీల్దార్, సర్వేయర్, విఆర్వోలు భూమిని పరిశీలించి దాదాపు ఎకరా భూమిని ఆక్రమించు కున్నట్లు గుర్తించి ప్రభుత్వ భూమికి చూట్టూ హద్దు రాళ్లు ఏర్పాటుచేశారన్నారు. ఆక్రమిత పొలంలోవ్యవసాయమోటార్ కు వున్న విద్యుత్తు కనెక్షన్ను కూడా తీసి వేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మరళా ఆస్థలంను ఆక్రమించి సాగు చేస్తున్నాడన్నారు. రికార్డుల మేరకు ఆభూమి ఎవరిదో నిర్ధారించి తగు చర్యలు చేప ట్టాలన్నారు. ఎస్సీ కాలనీలో అనేక మందికి గృహాలు లేక ఒక్కో ఇంటిలో ఇద్దరు,ముగ్గురు చొప్పున కుటుంబాలు నివాసం వుంటున్నాయని, ఆభూమిని స్వాధీన పరుచుకుని అర్హతగల పేద వారికి ఇళ్ల స్థల పట్టాలు మంజూరు చేయాలని అధికారులకు తెలి పారు. భూమిని పరిశీలించిన అధికారులు ఆ భూమి ప్రభుత్వ భూమిగా గుర్తించి హద్దు రాళ్లు వేసి స్వాదీనం చేసుకుంటామని తహసీల్దార్ సంజీవరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ వై.శ్రీనివాసరావు, విఆర్వో నాగలక్ష్మి, వి లేజ్ సర్వేయర్ ఖాదర్ భాష అనపర్తిసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *