రబీలో వేసుకున్న పంటల నమోదు జాబితాను రైతు సేవా కేంద్రాలలో ప్రదర్శించటం జరిగిందని వాటి వివరాలను రైతులు సరిచూసుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. లక్కవరం, దోసకాయల పాడు గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తుంది నిర్వహించారు. రైతులు ఈ- కెవైసీ ప్రాముఖ్యతను గుర్తించాలని చెప్పారు. అన్ని రైతు సేవా కేంద్రాలలో సామాజిక తనిఖీ, గ్రామ సభ, పంట నమోదు సూపర్ చెక్ పాదర్శకంగా రికార్డు చేసి జిల్లా కార్యాలయానికి పంపించటం జరుగుతుందని అన్నారు. విఏఏ లు వీరాంజనేయులు, బార్గవి తదితరులు పాల్గొన్నారు.
