రేషన్ కార్డుదారుల్లోని సభ్యులందరికి ఈకేవైసీ చేయించాలి

ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కార్డుల్లో గల సభ్యులందరికి ఈకేవైసీ చేయించాలని తహసీల్దార్ కె.సంజీవరావు తెలిపా రు.స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రేషన్డీలర్లకు ఈకేవైసీపై అవగాహన కార్య క్రమం బుదవారం జరిగింది. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండ లంలోని గ్రామాల్లో 4645 మందికి ఈకేవైసీ చేయాల్సి వుందన్నారు. కార్డుల్లో కొత్తగా యాడ్ ఐన వారందరికి ఈకేవైసీ నమోదు కాలేదన్నారు. ఆయా డీలర్లకు షాపుల వారిగా ఈ కేవైసీ కాని వారి జాబితాను అందజేయటం జరుగుతుందని, డీలర్ల వారి వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించాలన్నారు. రేషన్ కార్డుదారులందరికి అందజేయాలని, ఫిర్యాధులు వస్తే విచారించి తగుచర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు
, డీటీ ప్రశాంత్, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *