తాళ్లూరు మండలంలోని కొర్రపాటివారిపాలెంగ్రా
మంలో పల్లెపండుగ కార్యక్రమంలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఒం గోలు డివిజన్ పంచాయతీ రాజ్ ఈఈ వై.కోటేశ్వరరావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ పల్లెపండుగ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో సీసీరోడ్లు, సైడు కాలువల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా పనులు పూర్తి చేయటం జరిగిందన్నారు. మండలంలో 58 పనులకు 3కోట్లు మంజూరుకాగా 53 పనులు పూర్తయ్యాయన్నారు. కొర్రపాటివారిపాలెంలో 2పనులు వేగవంతంగా జరు గుతున్నాయన్నారు. నాణ్యతా ప్రమాణాల్లో లోపాలు లేకుండా పనులు చేయిస్తు న్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఏఈ ఎం వెంకటేశ్వర్లు, గొల్లపూడి వేణుబాబు, కొర్రపాటిరామయ్య తదితరులు పాల్గొన్నారు.
