2018 సంవత్సరం నుండి ఇప్పటివరకు ఒక్క డీఎస్సీనీ కూడా విడుదల చేయలేదనీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీనీ విడుదల చేస్తామని చేస్తామని మొదటి సంతకం డీఎస్సీ ఫైల్ మీద పెట్టి ఇప్పటివరకు డీఎస్సీనే విడుదల చేయక పోవడం పట్ల డివైఎఫ్ఐ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కే వీ పిచ్చయ్య ప్రభుత్వం పై మండిపడ్డారు. ఈ సందర్భంగా గురువారం కనిగిరి ఆర్డీవో కేశవవేశ్వర రెడ్డికి డివైఎఫ్ఐ కనిగిరి మండల కమిటీ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కే వీ పిచ్చయ్య మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం డీఎస్సీ ఇస్తామని నిరుద్యోగులకి అబద్ధాలు చెప్పి మోసం చేస్తుందన్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఎస్జిటి పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నాయని చెప్పటం పట్ల నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని దాదాపు.. వేలల్లో ఎస్జీటీ అభ్యర్థులు ఉన్నారని వెంటనే ప్రకాశం జిల్లాలో ఎస్జిటి పోస్టుల సంఖ్యను పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ కనిగిరి మండల కార్యదర్శి పి నరేంద్ర. నారాయణ. శ్రీను. ఎస్ఎఫ్ఐ కనిగిరి నియోజకవర్గం కార్యదర్శి పాండు తదితరులు పాల్గొన్నారు.
