దేశం కోసం 22 సంవత్సరాల చిన్న వయసులోనే ప్రాణాలర్పించిన భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల 94వ వర్ధంతి సందర్భంగా ఈనెల 23వ తేదీ నుండి భగత్ సింగ్ వారోత్సవాలు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలని డివైఎఫ్ఐ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కేవీ పిచ్చయ్య కనిగిరి ఆర్డిఓ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే పార్లమెంటు సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశం కోసం పోరాడిన వ్యక్తి భగత్ సింగ్ అని ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు నేటి యువత నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేటి యువత భగత్ సింగ్ చేగువేరా అడుగుజాడల్లో సోషలిస్టు సమాజం కోసం పోరాడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ కనిగిరి మండల కార్యదర్శి పి నరేంద్ర. నాయకులు శ్రీను. నారాయణ. ఎస్ఎఫ్ఐ డివిజన కార్యదర్శి పాండు తదితరులు పాల్గొన్నారు.
