తాళ్లూరు మండలంలో శుక్రవారం నిర్వహించిన ఇంగ్లీషు పరీక్షకు 9 మంది గైర్హాజరు అయ్యారు. బొద్దికూరపాడు ఎ, బి కేంద్రాలు, తూర్పుగంగవరం జెడ్పీ ఉన్నత పాఠశాల, జాహ్నవి హైస్కూల్, తాళ్లూరు వికే ఉన్నత పాఠశాల, సరస్వతి హైస్కూల్ కేంంద్రాలలో 818 మంది గాను 809 మంది హాజరైనారు. ఆయా పరీక్షా కేంద్రాలను ఎంఈఓ – 1 జి సుబ్బయ్య, ఎంఈఓ -2 సుధాకర్ రావులు పర్యవేక్షించారు. తూర్పుగంగవరంలో జాహ్నవి హైస్కూల్లో ఒక సబ్జెక్ట్ టీచర్ ను అదే సబ్జెక్టు రోజు ఇన్విజిలేటర్ గా నియమించటంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాళ్లూరులో సరస్వతి హైస్కూల్ అదే స్కూల్ విద్యార్థులు 60 మంది పరీక్షలు వ్రాస్తుండగా అదే పాఠశాలకు చెందిన వ్యక్తిని వాటర్ బాయ్ గా నియమించటం, ఆయన విద్యార్థులకు కాఫీలను అందించటంపై విమర్శలు రావటం జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ దృష్టికి వెళ్లటంతో వారు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా కేంద్రాల చీఫ్ లుగా వై శివ రామక్రిష్ణ ప్రసాద్ ఎం రమణా రెడ్డి, బండి శ్రీనివాస రావు, ఎం వెంకటేశ్వర్లు, అంజలి, రామారావులు, డీఓలుగా కోటేశ్వర రావు, పాపారావు, సీహెచ్ నాగేశ్వర రావు, ఎం యలమందా రావు, కె శ్రీనివాస రావు, నాగి రెడ్డిలు వ్వవహరించారు.
తాళ్లూరు మండలంలో పలు పరీక్షా కేంద్రాలపై ఆరోపణలు- ఇంగ్లీషు పరీక్షకు 9 మంది గైర్హాజరు
21
Mar