మహిళా సహాయక కేంద్రాల ఏర్పాటుతో మహిళలకు మరింత మేలు జరుగుతుందని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ అన్నారు. తాళ్లూరు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ శుక్రవారం అకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించారు. స్టేషన్ ప్రక్కనే ఉన్న పాత తహసీల్దార్ కార్యాలయం, విఆర్ఎ కార్యాలయాలను పరిశీలించి వీటిని పోలీస్ స్టేషన్ కు అనుసంధానంగా ఉండేలా చూస్తే బాగుంటుందని అన్నారు. పోలీస్ స్టేషన్ కు స్వంత భవనం ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో ఎన్ ఎస్పీ స్థలం కేటాయించారని కాని ఆ ఫైల్ విషయం పెండింగ్ లో ఉన్నట్లు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. మహిళా సహాయ కేంద్రం కు ఏర్పాటు చేసిన గదిని పరిశీలించారు. మహిళల కేసుల విషయంలో ప్రత్యేకంగా మాట్లాడేందుకు ఎంతో అనుకూలంగా ఉంటుందని అందు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్ వి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర , ఎస్సై మల్లిఖార్జున రావు తదితరులు పాల్గొన్నారు.



