పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి తాళ్లూరు మరియు ముండ్లమూరు పియస్ లను గురువారం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆకస్మికంగా సందర్శించి పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని,గదులను, రిసెప్షన్ కౌంటర్, మహిళా సహాయక కేంద్రం, స్టేషన్ పరిసరాలను మరియు పాత పోలీస్ స్టేషన్ లను పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేసారు. స్టేషనలలో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని వాటిని త్వరగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, మహిళలు/పిల్లలకు సంబంధించిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.
స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, గస్తీ విధులు పటిష్టంగా నిర్వర్తించి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. చెడునడత కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు శక్తి యాప్, సైబర్ మోసలపై, మాదకద్రవ్యాల పట్ల జరుగు అనర్ధాలపై, రోడ్డు భద్రత నియమాలు మరియు హెల్మెట్ పై అవగాహన, సీసీ కెమెరాలు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే వాటిని ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలను ప్రోత్సహించాలాన్నారు. స్టేషన్లో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు.
జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్వెంట ఎస్. బి ఇన్స్పెక్టర్
రాఘవేంద్ర, తాళ్లూరు ఎస్సై మల్లికార్జున మరియు సిబ్బంది ఉన్నారు.



