దర్శి పట్టణం లో శుక్రవారం జరిగిన ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల సందర్భంగా దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మెయిన్ బజార్ లోని ఆంజనేయ స్వామి మరియు కురిచేడు రోడ్ లోని ఆంజనేయ స్వామి ని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.
తదుపరి ఆర్యవైశ్య నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరియు దర్శి పట్టణం లో టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన మజ్జిగ, పులిహార పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ …..దర్శి ప్రాంతంలో ముఖ్యంగా దర్శి పట్టణంలో వైసిపి ప్రభుత్వం లో నిర్లక్ష్యంగా అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో నిత్యం మీ సేవకురాలుగా పనిచేస్తున్నానని….ఇందులో భాగంగానే దొనకొండ ప్రాంతంలో వలసలు నివారించి అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సోలార్ పార్కు త్వరలో రూపుదిద్దుకోబోతుందన్నారు. అదేవిధంగా దర్శి పట్టణంలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, అన్న క్యాంటిన్ ఏర్పాటు, డిగ్రీ కళాశాల శాశ్వత భవనాల నిర్మాణం, కొల్డ్ స్టోరేజ్ నిర్మాణం, టీటీడీ కళ్యాణం మండపం నిర్మాణం, దొనకొండ నుండి వెంకటాచలం పల్లి డబల్ రోడ్డులు గా విస్తరణ పనులు ఇలా అభివృద్ధి ఉపాధి అవకాశాల కోసం దర్శిని అభివృద్ధి ప్రాంతంగా మార్చేందుకు మీ సేవకురాలుగా పనిచేస్తున్నానని వివరించారు.ఈ కార్యక్రమం లో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్లు, మహిళలు, టిడిపి నాయకులు దారం సుబ్బారావు, దేవతి మహానంద, చిన్నా, వాసు, మధు, కర్నా శ్రీను తదితర నాయకులు మరియు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.





