కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశానికి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి సుజిత తెలిపారు. 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్ మీడియట్ బైపీసీలో 40 సీట్లకు, 7, 8, 9, 10,12 తరగతులలో మిగుల సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. మార్చి 22 నుండి ఏప్రియల్ 11వ తేది వరకు కెజిబీవీ వెబ్ సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు, దివ్యాంగులకు, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన బాలికలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆన్ లైన్లో దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ల కొరకు పరిగణించబడతాయని చెప్పారు. ఎంపికయిన విద్యార్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందించబడునని తెలిపారు. పూర్తి వివరాలకు ఫోన్ నంబర్ 9515838862 ను సంప్రదించాలని కోరారు.
కస్తూరిభాలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
22
Mar