బేగంపేట, మార్చి 23 (జేఎస్డిఎం న్యూస్) :
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లో అన్ని వర్గాలకు సముచిత మైన గౌరవం అందుతుందని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి సంజయ్ ఆదివారం బేగంపేట్ డివిజన్ పరిధిలో బేగంపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగౌరపల్లి రమేష్అధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం కార్యక్రమం లో బండి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణలకు చట్టబద్ధత కల్పించిన సందర్భంగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా బండి రమేష్ పా ల్గోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమం లో ఏ & బి బ్లాక్ అధ్యక్షులు
పి నాగి రెడ్డి, తూము వేణు, సీనియర్ నాయకులు విశాల్ సుధాం, బంగారి దయానంద్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాధా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ కాంగ్రెస్ నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
