గత ప్రభుత్వం చేపట్టిన ‘రిసర్వే వల్ల తమ సొంత భూములు రికార్డుల్లో గల్లంతయ్యాయని బొద్దికూరపాడు గ్రామస్తులు సోమ వారం తహసీల్దార్ సంజీవరావుకు వున్నవించారు. తమకు చెందిన భూములు శంకర నారాయణ పురం రెవెన్యూ పరిధిలో వుండి తమ అనుభవంలో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన రీసర్వేలో రెవెన్యూ అధికారులు తమ ఇష్టాను సారం తీసుకున్న నిర్ణయాల వల్ల తమకు చెందిన భూమి రికార్డుల్లో విస్తీర్ణం తగ్గగా, కొందరికి భూమిలేకున్నా భూమి ఉన్నట్లు రికార్డులు సృష్టించారన్నారు. తమ అవసరాల కోసం తమ భూములను అమ్ముకునేందుకు రిజిస్టర్ కార్యాలయంకు వెళ్లగా రికార్థుల్లో తమ పేరు లేక ఇతరులుగా వుందని దీంతో రిజిస్ట్రేషన్ నిలిచి పోయిందన్నారు. అధికారులు చేసిన తప్పిదాలకు తాముతీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. దీనిపై తహసీల్దార్ సంజీవరావు స్పందించిగతంలో కొందరి భూముల్లో సాగర్ కాలువలకు పోయాయని, వాటికి ప్రభుత్వం నష్ట పరిహారం అందించిందని, రికార్డుల మేరకు అన్ని విషయాలను పరిశీలించి భూమి హక్కుదారులకు భూమి హక్కు కల్పించటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ వై. శ్రీనివాసరావు, రిటైర్డ్ టీచర్ ఎస్ అంజిరెడ్డి, ఆగ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
