తాళ్లూరు మండలంలో పది పరీక్షల పట్టు బిగించిన అధికారులు- జిల్లా విద్యాశాఖాధికారి, రాష్ట్ర పరీక్షల విభాగం ప్రత్యేక స్క్వాడ్ అకస్మిక తనిఖీలు

ఎట్టకేలకు పది పరీక్షల నిర్వాహణపై విద్యాశాఖాధికారులు పట్టు బిగించారు. మండలంలోని ఆరు పరీక్షా కేంద్రాలలో గత మూడు పరీక్షలకు ఆయా చీఫ్ లు , డివోల కొంత వైఖరి స్వభావం కారణంగా ఆయా కేంద్రాలలో పరీక్షలు ఒక తంతుగా నిర్వహించారు. మెరిట్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పరీక్షలు ఇలా నిర్వహించకుంటే ఎమిటి అని నిట్టూర్చారు. ఆర్థిక అంగ బలం ఉన్న ప్రవేట్ పాఠశాల మెనేజ్ మెంట్స్ ఇస్టాను సారంగా పరీక్షల సిబ్బందిని ప్రలోభాలకు గురిచేసి తెలుగు, ఇంగ్లీషు, హిందీ పరీక్షలు పూర్తి చేసారు. అయితే విషయాలు జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి వెళ్లటంతో సోమవారం లెక్కల్ పరీక్షలు ఎటువంటి అవకతవకలు లేకుండా జరుపుటలకు జిల్లా విద్యాశాఖ ప్రత్మేక చర్యలు చేపట్టారు. 144 సెక్షన్ తో పాటు పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు కూడ ఉదయం పూట పాఠశాలలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్, రాష్ట్ర పరిక్షల విభాగం ప్రత్యేక స్క్వాడ్ అధికారి సుబ్బా రెడ్డి తాళ్లూరు వికే ఉన్నత పాఠశాల, నరస్వతి హైస్కూల్ ల తో పాటు పలు పరీక్షా కేంద్రాల ను పరిశీలించారు. వారి వాహనాలను దూరంగా నిలుపు దల చేసుకుని సాధారణ వ్యక్తుల వలే ఆయా పరీక్షా కేంద్రాలలో తనిఖీలు నిర్వహించారు.
తాళ్లూరు, తూర్పుగంగవరం పరీక్షా కేంద్రాలలో జిల్లా విద్యాశాఖాధికారి రాకతో లెక్కల్ పరీక్ష చాలా పగడ్బందీగా జరిగిందని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా తూర్పగంగవరం జాహ్నవి పాఠశాలలో పరీక్షల చీఫ్ ను, డీఓ లను మార్పు చేసారు. చీఫ్ గా వెంకటేశ్వర్లు, డీఓగా క్రిష్ణా రెడ్డిలను నియమించారు. మండలంలో ఆరు పరీక్షా కేంద్రాలలో 821 మందికి గాను, 809 మంది పరీక్షలకు హాజరు అయినట్లు మండల విద్యాశాఖాధికారి జి నుబ్బయ్య తెలిపారు. జాహ్నవి పరీక్షా కేంద్రాన్ని ఎంఈఓ జి నుబ్బయ్య సందర్శించారు. తాళ్లూరులో ఎంఈఓ – 2 నుధాకర రావు నందర్శించి పరీక్షల నిర్వాహణ తీరును గమనించారు. కాగా బొద్దికూర పాడు ఎ, బి కేంద్రాలలో పరీక్షల నిర్వహణ సమయంలో గోడల వద్ద నుండి అందిస్తున్న చీటీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పాఠశాలపై ప్రత్యేక నిఘా ఉంచి మాన్ కాపీయింగ్ ను అరికట్టాల్సి ఉంది .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *