బేగంపేట మార్చి 25(జే డి ఎం న్యూస్)
ఎన్నో ఏళ్లుగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న జిహెచ్ఎంసి చైన్ మెన్ల కు స్థానచలనం కల్పించాలంటూ జిహెచ్ఎంసి,సిసిపి శ్రీనివాస్ ను దళిత చైతన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పిడి నవీన్ కుమార్ మాదిగ మంగళవారం కలిశారు.జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్న చైన్ మెన్ లను స్థానచలనం చేయాలని…అలాగే న్యాక్ ఇంజనీర్లను పూర్తిగా తొలగించాలని లికిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా సికింద్రాబాద్ జోన్ పరిధిలోని సికింద్రాబాద్,బేగంపేట్ సర్కిల్ లలో గత కొద్ది సంవత్సరాలుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న చైన్ మెన్ ల వల్ల ఆయా సర్కిల్ లు అవినీతిమయమయ్యాయని..ఎక్కడ చూసినా అక్రమ కట్టడాలే దర్శనమిస్తున్నాయన్నారు.వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.కొంతమంది చైన్ మెన్ లు,నాక్ ఇంజనీర్లు అవినీతికి పాల్పడుతున్నట్లు స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు.వారిపై ఎంక్వయిరీ చేసి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని సిసిపి శ్రీనివాస్ చెప్పినట్లు ముప్పిడి వెల్లడించారు.

