టీడీపీ ఆవిర్భవించి ఈనెల 29వతేదీనాటికి 43 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి గ్రామంలో టీడీపీ జెండాలను అవిష్కరించాలని ఆపార్టీ మండల అధ్యక్షుడు బొమ్మిరెడ్డి.ఓబుల్ రెడ్డి గురు వారం కోరారు. గ్రామపార్టీ అధ్యక్షులు దిమ్మెలు ఏర్పాటుచేసి జండాలను ఆవిష్కరించాలన్నారు. అన్ని గ్రామాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక లను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన తాళ్లూరులో ఎన్డీఆర్ విగ్రహం వద్ద జరుగనున్న ఆవిర్భావ దినోత్సవ వేడుక లకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువనాయ కుడు లలిత్ సాగర్ లు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈనెల 29న టీడీపీ ఆవిర్భావ దినోత్సవం – గ్రామ గ్రామాన జెండాల ఏర్పాటుకు శ్రీకారం
28
Mar