ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు కావాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. శివరామపురం రైతు సేవా కేంద్రం పరధిలో శనివారం రైతు రిజిస్ట్రేషన్ ప్రాధాన్యత వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. మార్చి 31లోపు రైతులు అందరూ రిజిస్ట్రేషన్ కావాలని కోరారు. అసైన్మెంట్ భూములు, డి పట్టా, పట్టా భూములు కలిగిన రైతులు 20వ విడుత పీఎం కిసాన్ నిథి జమ పడాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కావాలని కోరారు. విఏఏ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
