సికింద్రాబాద్ మార్చి 30(జే ఎస్ డి ఎం న్యూస్) :
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ సభ్యుడిగా నిజాం వైద్య విజ్ఞాన సంస్థ, వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల ప్రిన్సిపాల్ శిరందాస్ శ్రీనివాస్ ని నియమించిన సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మంచాల రవీందర్ శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ వైద్య అనుబంధ వృత్తుల అభివృద్ధికి, విద్య, శిక్షణ విషయంలో సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర స్థాయి కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.నేడు రోగనిర్దారణ, చికిత్స, సేవలలో వైద్య అనుబంధ వృత్తుల ప్రాముఖ్యత చాలా పెరిగిందని తెలుపుతూ వైద్యరంగంలో సాంకేతికత అభివృద్ధి చెందడంతో ఈ విభాగపు నిపుణులకు డిమాండ్ పెరగడమే కాకుండా శిక్షణా అవసరాలు కూడా పెరిగాయని, ప్రస్తుతం వైద్య రంగంలో నాణ్యమైన సేవలు అందించడానికి సుశిక్షితులైన సాంకేతిక సిబ్బంది అవసరం పెరగడంతో రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుతో ఈ వృత్తి ఉద్యోగుల నమోదు, సరియైన గుర్తింపు మరియు ఉద్యోగం, విజ్ఞానం, కోర్సుల క్రమబద్దీకరణ సాధ్యపడుతుందని మంచాల రవీందర్ వివరించారు. శిక్షణ పొందిన, అర్హులైన సాంకేతిక సిబ్బంది విధిగా రాష్ట్రస్థాయి కౌన్సిల్ లో మరియు జాతీయ స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
అంతేకాకుండా ఎలాంటి మౌలిక వనరులు లేకుండా, ఆసుపత్రి వసతులు లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న విద్యా సంస్థలను నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపారు..కోర్సుల నిర్హహణ, కామన్ సిలబస్
రూపొందించాల్సి ఉందని తెలిపారు. రానున్న కాలంలో
వైద్య అనుబంధ వృత్తి ఉద్యోగాలకు చాలా డిమాండ్ ఉంటుందని తెలిపారు.
అంతే కాకుండా అర్హులైన వారికి ప్రభుత్వ రంగంలో పదోన్నతులు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు నిర్మల నిమ్స్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

