మహంకాళి, మార్చ్ 30 (జేఎస్ డి ఎం న్యూస్) :
నూతన తెలుగు సంవత్సరాది ఉగాది విశ్వావసునామ సంవత్సరాన్ని పురస్కరించుకొని రాంగోపాల్పేట్ కార్పొరేటర్ దంపతులు చీర సుచిత్ర సత్యనారాయణ లు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చీర సుచిత్ర మాట్లాడుతూ నూతన తెలుగు సంవత్సరాది ఉగాది ప్రజలందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఉజ్జయిని మహాకాళి అమ్మవారు ప్రతి ఒక్కరినీ ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని కోరారు. పూజలలో పాల్గొన్న కార్పొరేటర్ దంపతులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాల ను అందజేశారు. కార్పొరేటర్ వెంట బిజెపి నాయకులు వజనాల దయానందరావు తదితరులు ఉన్నారు.

