తాళ్లూరు మండలంలోని విఠలాపురం గ్రామానికి చెందిన భూదేవి భక్తుడు ఉగాది పండుగ రోజున 6 అడుగుల గుంటలో ఉండి పైన కుమారునికితో మట్టితో పూడ్పించుకుని జీవ సమాధికానున్నాడని వందతులు రావటం తో తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జునరావు ఆధ్వర్వంలో పోలీసులు రంగప్రవేశం చేసి బయటకు తీసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే… విఠలా పురం మాజీ సర్పంచ్ కైపు అంజిరెడ్డి కుమారుడు కోటిరెడ్డి భూదేవి భక్తుడు. భూదేవి మీద మితిమీరిన అభిమానంతో కొంతకాలం క్రితంభూమిలో 40 అడుగుల లోతులో గుంట తీసి భూదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. నిత్యం ఆ గుంటలోకి వెలుతూ తన తోచిన రీతిలో పూజలు చేస్తుంటాడు. భక్తులు లోనికి వెళితే కనీసం గాలిసోకక ఇబ్బందులు పడుతుండగా గత రెండేళ్ల క్రితం వెలుపల మరో ఆలయాన్ని నిర్మించి భూదేవి విగ్రహాన్ని వెలుపల గుడిలో ఏర్పాటు చేశాడు. తనకు భూదేవిపై నమ్మకంతో ఈఏడాది భూదేవి ఆలయం ప్రక్కనే ఆరుఅడుగుల గుంతను తీశాడు. ఉగాది పండుగ రోజు ఆదివారం వేకువజామున నాలుగు గంటల సమయంలో గుంటలో కూర్చున్నాడు. కోటిరెడ్డి కుమారుడు పైన రేకు వేసి మట్టితో పూడ్చి వేశాడు. ఈ విషయాన్ని అంతా వీడియోలో చిత్రీకరించి తన సెల్ ఫోన్ ద్వారా స్నేహితులకు పంపాడు. కోటి రెడ్డి జీవసమాధి అయ్యాడు అన్న వార్త దావానంలా వ్యాప్తి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్సై ఎస్.మల్లిఖార్జునరావు ఆధ్వర్యంలో ఏఎస్సై మోహన్ రావు సిబ్బంది విఠలాపురం గ్రామానికి 11 గంటల సమయంలో వెళ్లి గుంటలో వ్యక్తిని బయటకు రమ్మని పిలువగా నిరాకరించాడు. పోలీసుల విన్నపం మేరకు 8గంటల పాటు గుంటలో వున్న కోటిరెడ్డి భయటకు రాగా పోలీసులు గుంట పూడ్పించి, అక్కడ ఏర్పాటు చేసిన టెంట్ ను పీకించి
వేయించారు. ఇలాంటి పనులు చట్టారిత్యానేరమని, కోటిరెడ్డికి ప్రాణాపాయం జరిగితే కుటుంబీకులపై తగు కఠిన చర్యలు తీసు కోవటం జరుగుందని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు జోక్యంతో ఉదయం నుండి జరిగిన హైడ్రామాకు తెరపడింది.


