కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న వక్స్ సవరణ బిల్లుకు ఈద్గాల వద్ద ముస్లీం సోదరులు నల్ల రిబ్బర్లు ధరించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వక్స్ సవరణ బిల్లు తీసుకువస్తూ వారి హక్కులను కాల రాసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ముస్లీంల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోవాలని కోరారు. ముస్లీం వేల్పేర్ మండల అధ్యక్షులు, వార్డు సభ్యులు ఫజల్, ముత వల్లి, రసూల్, కాలం, హుస్సేన్ బాష, మదార్ వలి, మత గురువులు పాల్గొన్నారు.

