దర్శి నియోజకవర్గంలోని ముస్లిం సంక్షేమానికి ప్రార్థన స్థలాల అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తానని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ,దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా దర్శి కురిచేడు రోడ్ లోని ఈద్గా వద్ద నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భముగా వైసిపి పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ….ముస్లీం ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అన్నారు…మా సొంత ట్రస్టు బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్టు నుండి రూ.5 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తానని తెలిపారు.
ఈద్గా అభివృద్ధి కి జిల్లా పరిషత్ నుండి నిధులు కేటాయిస్తామని అన్నారు.పార్టీ లో ముస్లింలకు ప్రాధాన్యత కల్పిస్తామని కబరిస్తాన్ ఏర్పాటు సహకారం అందిస్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ ఎం భాష పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు.






