పోలీసు శాఖలో విశేష సేవలు అందించి పదవీ విరమణ పొందిన జరుగుమల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎఎస్సై జి.శ్రీనివాసరావు (ASI -1985, 41 సర్వీస్), గిద్దలూరు పోలీస్ స్టేషన్ విధులులో నిర్వహిస్తున్న కె.వి. రమణ రెడ్డి (HC -2334, 35 సర్వీస్) మరియు స్వచ్ఛంద విరమణ ఐటి కోర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సిహెచ్.శ్రీనివాసులు(HC.299, 29 సర్వీస్) లను సోమవారం ఎస్పీ
జిల్లా పోలీస్ కార్యాలయంలో శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.
జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్
మాట్లాడుతూ…. పోలీస్ శాఖలో చేరినప్పటి నుండి నేటి వరకు ప్రజలకు సేవ చేస్తూ పదవీ విరమణ పొందడం అదృష్టమన్నారు. పదవీ విరమణ ప్రతి ఒక ఉద్యోగికి తప్పదని, ఉద్యోగంలో ఉన్నపుడు చేసిన సేవలే ఉద్యోగణాంతరం కూడా వ్యక్తి గుర్తుండేలా మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తాయని, పగలనక, రాత్రనక, పండగల సమయంలో కుటుంబానికి దూరంగా ఉండి విధులు నిర్వహించారన్నారు. పోలీస్ ఉద్యోగ నిర్వహణలో ఎంతో నిబద్దత, అంకితభావంతో జిల్లా పోలీస్ శాఖకు అందించిన సేవలను శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేటట్లు అన్ని చర్యలు తీసుకుంటామని, వచ్చిన డబ్బులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, మిగిలిన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు. పదవీ విరమణ తర్వాత కూడా మీరు పోలీసు కుటుంబంలో సభ్యులేనని, భవిష్యత్తులో వారికి ఏ సహాయం కావాలన్నా పోలీస్ శాఖ ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే పదవీ విరమణ పొందిన సిబ్బంది యొక్క కుటుంబ వివరాలను, పిల్లల చదువుల, ఉద్యోగ స్థితిగతులను గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఆర్ఐ సీతారామిరెడ్డి, ఎఆర్ఎస్సై తిరుపతి స్వామి, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






