హైదరాబాద్ ఏప్రిల్ 1(జే ఎస్ డి ఎం న్యూస్):
నేటి నుంచి 3 రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 km వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. గద్వాల్, వనపర్తి, నారాయణపేట్, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేసింది..
