సికింద్రాబాద్ ఏప్రిల్ 1(జే ఎస్ డి ఎం న్యూస్):
మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఉగాది, రంజాన్ పండుగలు రెండు రోజులు వరుసగా వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయం వద్ద ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట, సనత్ నగర్, రాంగోపాల్ పేట డివిజన్ తదితర ప్రాంతాలకు చెందిన హిందువులు, ముస్లీం లు పెద్ద సంఖ్యలో కలిసి శాలువాలు, పుష్ప గుచ్చాలతో సత్కరించి ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. బన్సీలాల్ పేట కు చెందిన అబ్బాస్ అందజేసిన రంజాన్ సందర్భంగా ప్రత్యేక వంటకంగా నిలిచే షీర్ కుర్మా (సేమియా)ను తలసాని శ్రీనివాస్ యాదవ్ సేవించారు. తనను కలిసిన వారికి తలసాని ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తెలిపిన వారిలో బన్సీలాల్ పేట కార్పొరేటర్ కుర్మ హేమలత, బన్సీలాల్ పేటకు చెందిన ముస్లీం నాయకులు రజాక్, అబ్బాస్, జావీద్, షరీఫ్, జహంగీర్, సనత్ నగర్ కు చెందిన జమీర్, వసీం, ఇబ్రహీం, రాంగోపాల్ పేట డివిజన్ కు చెందిన బెంగాలీ సమాజ్ ప్రతినిధులు పబ్బా ప్రకాష్, అబ్బుల్, మోహి దుల్, బాపి, బన్సీలాల్ పేట డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు లక్ష్మీపతి, బలరాం, కుమార్ యాదవ్, అరుణ్ గౌడ్, నాగభూషణం, దేశపాక శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.



