బేగంపేట ప్రకాశం నగర్ లోని
శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కోదండ రామాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈనెల ఆరవ తేదీన సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయం ఈ ఓ విఠలయ్య, శ్రీ భూ లక్ష్మమ్మ ఆలయ నిర్మాణ దాత విశాల్ సుధాం లు తెలియజేశారు.
మార్చి నెల 30వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 6వ తేదీన జరగనున్న శ్రీ సీతా రాముల కళ్యాణ మహోత్సవం తో ముగియనున్నాయి. వసంత నవరాత్రుల సందర్బంగా కోదండ రామాలయంలో ప్రతీ రోజు ఉదయం 9గంటలకు దంపతులచే విశేష నిత్యార్చన తీర్థ ప్రసాద వితరణ. సాయంత్రం 6గంటలకు సామూహిక విష్ణుసహస్ర నామ, నామరామాయణ పారాయణ తీర్థ ప్రసాద వితరణ చేస్తున్నారు.
కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా 3న గురువారం సాయంత్రం 5గంటలకు పసుపు దంపుడు కార్యక్రమం కల్యాణ వేడుకలు స్వామి వారిని అమ్మవారిని పెళ్లికూతురు, పెళ్ళికొడుకు గా అలంకరించు కార్యక్రమం భక్తులు
చే జరుగుతున్నాయి.ఈ కార్యక్రమం లో పాల్గొనేవారు తమతో పాటు పళ్ళు, పూలు, తమలపాకులు, ఏదైనా ఒక స్వీట్ తీసుకు రావాలని ,డ్రెస్ కోడ్ పసుపు రంగు ధరించాలన్నారు.
తేది 6న ఆదివారం ఉదయం గం11.52 నిముషాలకు మిధున లగ్న పుష్కరాంశ సుముహూర్తమున మిధిలా ధిపతి జనక నందిని అయిన సీతామాతను,అయోధ్యాధిపతి దశరధ నందనుడు అయిన శ్రీరామచంద్రుని తో తిరుక్కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవముగా భక్తులచే జరుపుటకు నిర్ణయించడమైనది. మధ్యాహ్నం 1గంటకు అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పూజ కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు.


