వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు నీటి తొట్టుల నిర్మాణం చక్కగా ఉపయోగపడతాయని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అన్నారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు నిర్మిస్తున్న పశులు తొట్టిలకు మంగళవారం వెలుగు వారి పాలెంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 16 పంచాయితీలలో పశువుల తొట్టులు నిర్మించి త్వరగా పశువులకు అందుబాటులోనికి తీసుకురావాలని కోరారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, ఎంపీడీఓ దార హనుమంత రావు, ఎపీఓ మురళి, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శులు శాగం కొండా రెడ్డి, మానం రమేష్ బాబు, క్లస్టర్ ఇన్చార్జి రొచకొండ వెంకట రావు, యాడిక శ్రీనివాస రెడ్డి, సర్పంచి కోటేశ్వర రమ్మ, ఈసీ గురు బాబు, టీఏలు కోటేశ్వర రావు, రమేష్, సిబ్బంది. పాల్గొన్నారు.

