పదవ తరగతి పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిసాయి.
మండలంలో మంగళవారం సోషల్ పరీక్షలో 11 మంది గైర్హాజరు అయినట్లు ఎంఈఓ జి సుబ్బయ్య తెలిపారు. ఆరు పరీక్షా కేంద్రాలలో 820 మంది గాను 809 మంది హాజరైనారు. ఆయా కేంద్రాల చీఫ్ లుగా వై శివ రామక్రిష్ణ, ఎం రమణా రెడ్డి, బండి శ్రీనివాస రావు, వెంకటేశ్వర్లు, అంజలి, రామారావు డీఓలుగా కోటేశ్వర రావు, పాపా రావు, సీహెచ్ నాగేశ్వర రావు, క్రిష్ణా రెడ్డి, కె శ్రీనివాస రావు, నాగి రెడ్డిలు వ్యవహరించారు. పరీక్షలు ముగియటంతో విద్యార్థులు ఆయా పరీక్షా కేంద్రాల నుండి ఉత్సాహంగా కేరింతలు కొడుతూ వచ్చారు.

