హైదరాబాద్ ఏప్రిల్ 1(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న దాడులను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. మంగళవారం మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద నాగర్ కర్నూల్ అత్యాచార బాధితురాలతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. మహిళా కమిషన్ బాధితురాలుకి అండగా ఉంటుందని, ప్రభుత్వం నుంచి సత్వర సహకారం అందుచేలా చర్యలు తీసుకుంటామని బాధితురాలికి ధైర్యాన్ని కల్పించారు. జర్మనీ మహిళా హైదరాబాదులోని మామిడిపల్లిలో అత్యాచార బాధితురాలీ క్షేమ సమాచారం గురించి అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్భంగా తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద మాట్లాడుతూ అత్యాచార బాధితురాలు భవిష్యత్తు మరియు సమాచార గోపిక నిమిత్తం ఎటువంటి సమాచారం బయటకు వ్యక్తపరచడం లేదన్నారు. సమాజంలో ఉన్న అగ్రగామి హక్కుల సంస్థలు మరియు ప్రభుత్వం అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సూచించారు .మహిళలు బాలికలకు ఇలాంటి విషయాల్లో అతి ముఖ్యమైన మౌలిక హక్కులు ఉన్నాయని ఆ హక్కులను కాపాడుతూ లైంగిక దారులను అరికట్టే పోరాటం మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లాలని నేరెళ్ల శారద కోరారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్….మహిళలు బాలికలకు ముఖ్యమైన మౌలిక హక్కులున్నాయి..లైంగిక దాడులను అరికట్టే పోరాటం మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లాలి….. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద………
01
Apr